రామగుండం : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో నీటి నిల్వ బుధవారం సాయంత్రానికి 19.369 టీఎంసీలకు చేరింది.
నిండుకుండలా ఎల్లంపల్లి
Aug 31 2016 11:35 PM | Updated on Sep 4 2017 11:44 AM
రామగుండం : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో నీటి నిల్వ బుధవారం సాయంత్రానికి 19.369 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో 521 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 521 క్యూసెక్కులుగా ఉంది. అందులో ఎన్టీపీసీకి 363, హైదరాబాద్ మెట్రోకు 158 క్యూసెక్కులు సరఫరా అవుతున్నాయని ఫ్లడ్ మానిటరింగ్ అధికారులు తెలిపారు. మరో 48 గంటల్లో ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరే అవకాశముంది.
Advertisement


