కెమికల్ ఫ్యాక్టరీలో కూలీ మృతి | Worker died in Chemical Factory | Sakshi
Sakshi News home page

కెమికల్ ఫ్యాక్టరీలో కూలీ మృతి

Nov 1 2016 11:47 PM | Updated on Sep 4 2017 6:53 PM

కెమికల్ ఫ్యాక్టరీలో కూలీ మృతి

కెమికల్ ఫ్యాక్టరీలో కూలీ మృతి

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీ పిల్లర్‌లో పడి ఓ దినసరి కూలీ మరణించాడు.

భిక్కనూరు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీ పిల్లర్‌లో పడి ఓ దినసరి కూలీ మరణించాడు. ఎస్సై కృష్ణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సదాశివనగర్ మండలానికి చెందిన సొన్నాయిల నర్సింలు (30) అనే యువకుడు దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. శనివారం భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీలో పనికి వెళ్లాడు. అక్కడ పిల్లర్ గుంతలో పడి మరణించాడు. ఆ సమయంలో ఎవరూ గమనించలేదు.
 
 ఆదివారం దీపావళి పండుగ కావడంతో పనులు జరగలేదు. సోమవారం పనులకు వెళ్లినవారికి పిల్లర్ గుంతలోని నీటిలో తేలుతూ నర్సింలు మృతదేహం కనిపించింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పైకి తీయించి, పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పనిచేస్తున్న సమయంలో ఫిట్స్‌కు గురై గుంతలో పడి మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడికి భార్య వసంత, కూతురు పల్లవి, తండ్రి గంగయ్య ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement