నాన్‌వెజ్‌ కర్రీ వండలేదని.. | Tragic incident in Kamareddy District: Telangana | Sakshi
Sakshi News home page

నాన్‌వెజ్‌ కర్రీ వండలేదని..

Apr 27 2026 6:17 AM | Updated on Apr 27 2026 6:17 AM

Tragic incident in Kamareddy District: Telangana

శివాజీ

దంపతుల మధ్య గొడవ.. కొడవలితో దాడి చేసిన భార్య.. భర్త మృతి   

కామారెడ్డి టౌన్‌: మాంసాహారం విష యంలో భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ.. ఇద్దరు చిన్నా రులను అనాథలను చేసింది. క్షణికావేశంలో కొడవలితో భార్య దాడి చేయడంతో భర్త అక్కడికక్కడే మృతిచెందాడు. ఆమె కటకటాల పాలయ్యింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీకి చెందిన కోదండ శివాజీ (30), అతడి భార్య లక్ష్మి మధ్య వారంరోజులుగా గొడవ జరుగుతున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో శనివారం రాత్రి నాన్‌వెజ్‌ వండాలని శివాజీ కోరగా లక్ష్మి నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన లక్ష్మి పక్కనే ఉన్న కొడవలితో శివాజీపై దాడి చేసింది. గొంతు, మెడ భాగంలో లోతుగా తెగడంతో శివాజీ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటన స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఏడాది, రెండేళ్ల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తండ్రి మరణించడం, తల్లి అరెస్ట్‌ కావడంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement