మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి | womens achived financial development | Sakshi
Sakshi News home page

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

Aug 26 2016 11:11 PM | Updated on Sep 4 2017 11:01 AM

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

చౌటుప్పల్‌ : ప్రతి మహిళ స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించాలని నాబార్టు జనరల్‌ మేనేజర్‌ బి.దయామృత అన్నారు.

చౌటుప్పల్‌ : ప్రతి మహిళ స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించాలని నాబార్టు జనరల్‌ మేనేజర్‌ బి.దయామృత అన్నారు. మండలంలోని దామెర గ్రామంలో నాబార్డు, శాంతి గ్రామీణాభివృద్ధి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు స్కూల్‌ బ్యాగుల తయారీలో శిక్షణ ఇచ్చారు. వీరికి శుక్రవారం ఆమె సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు నూపుణ్యంతో స్కూల్‌ బ్యాగులు, ట్రావెల్‌ బ్యాగులు, పర్సులను తయారు చేయాలన్నారు. తద్వారా స్వయం ఉపాధిని పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు బక్క యాదయ్య, కోఆర్డినేటర్‌ చెక్క బాలకిషన్, విమల, సరస్వతి, స్వాతి, విజయమ్మ, రజిత, అనిత, సునీత, రజని తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement