మతిస్థిమితం లేని మహిళ ఆత్మహత్య | women suicide in nijamabad district | Sakshi
Sakshi News home page

మతిస్థిమితం లేని మహిళ ఆత్మహత్య

Jun 11 2017 5:32 PM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్‌జిల్లాలో మతిస్థిమితం లేని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

ఎల్లారెడ్డి: నిజామాబాద్‌జిల్లాలో మతిస్థిమితం లేని మహిళ తనంతటతానే కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడింది. లింగంపేట మండలం పొల్కంపేట గ్రామానికి చెందిన మేరీ సత్తవ్వ(62) కిరోసిన్‌ పోసుకుని కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా సత్తవ్వకు మతిస్థిమితం లేదని, దాంతో శనివారం రాత్రి గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని  ఎస్సై సంపత్‌కుమార్‌ తెలిపారు.

కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందిందన్నారు. కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతురాలికి కొడుకు మల్లేశ్‌ ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement