అనంతపురం సెంట్రల్ : వృద్ధులకు మాయమాటలు చెప్పి చోరీలకు పాల్పడుతున్న మహిళా దొంగలను మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. త్రీటౌన్ సీఐ వెంకటేసులు, ఎస్‌ఐ రెడ్డప్ప వివరాల మేరకు... గతేడాది సెప్టెంబర్‌లో రెండో రోడ్డుకు చెందిన వృద్ధురాలు శకుంతలమ్మ(72) రైల్వే స్టేషన్ సమీపంలోని వినాయకుడి ఆలయానికి వచ్చారు.
వారి మాటలను నమ్మిన వృద్ధురాలు చేతిగాజులు, గొలుసును తీసి ఇచ్చింది. నగలు చేతికందిన వెంటనే అక్కడినుంచి జారుకున్నారు. విషయాన్ని గమనించిన వృద్ధురాలు త్రీటౌ¯ŒS పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరంలోని నడిమివంక సమీపంలో ఉండగా శాంతిప్రియ, హరిత వీరి తల్లి తిమ్మక్కలను ఎస్‌ఐ రెడ్డప్ప తన సిబ్బందితో కలిసి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గతంలోనూ ఓ వృద్ధురాలిని ద్విచక్రవాహనంలో నగర శివారు ప్రాంతానికి తీసుకెళ్లి కత్తులతో బెదిరించి, నాలుగు తులాల బంగారు నగలు అపహరించారు.