వివాహిత ఆత్మహత్య | woman suicides | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Apr 5 2017 11:10 PM | Updated on Sep 5 2017 8:01 AM

మండలంలోని భీమునిపల్లిలో భాస్కర్‌రెడ్డి భార్య ధనలక్ష్మీ(28) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ రమణారెడ్డి తెలిపారు.

పెద్దవడుగూరు : మండలంలోని భీమునిపల్లిలో భాస్కర్‌రెడ్డి భార్య ధనలక్ష్మీ(28) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ రమణారెడ్డి తెలిపారు. పెళ్లై పదేళ్లవుతున్నా పిల్లలు పుట్టకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ మంగళవారం మరోసారి గొడవపడ్డారని వివరించారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారన్నారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మరణించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలి తండ్రి తిరుపాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement