breaking news
dhanalaxmi
-
బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా.. షేర్లు ఢమాల్!
ప్రైవేట్ రంగ ధనలక్ష్మి బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్ శ్రీధర్ కళ్యాణసుందరం బోర్డుతో విభేదాల కారణంగా రాజీనామా చేశారు. ఆయన వైదొలిగిన గంటల వ్యవధిలోనే బ్యాంక్ షేర్లు భారీగా పడిపోయాయి. ధనలక్ష్మి బ్యాంక్ షేర్లు పాక్షికంగా కోలుకోవడానికి ముందు సోమవారం (సెప్టెంబర్ 18) 9 శాతం వరకూ పడిపోయాయి. ఉదయం 10:20 గంటల సమయానికి బ్యాంక్ షేర్లు 3.25 శాతం క్షీణించి 28.20 రూపాయల వద్ద ఉన్నాయి. కేరళలోని త్రిసూర్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ధనలక్ష్మి బ్యాంక్‌కి కళ్యాణసుందరం 2022 డిసెంబరులో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. (ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు బిగ్ బొనాంజా.. వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం) ధనలక్ష్మి బ్యాంక్ ప్రస్తుతం బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శివన్ నేతృత్వంలో ఉంది. అపరిష్కృతంగా ఉన్న బ్యాంకు ప్రణాళికాబద్ధమైన హక్కుల సమస్యపై తాను ప్రశ్నలు లేవనెత్తానని, దీంతో తనను బ్యాంకు నుంచి తొలగిస్తామని బెదిరించారని సెప్టెంబరు 16న ఎక్స్ఛేంజీలకు పంపిన లేఖలో కళ్యాణసుందరం ఆరోపించారు. ధనలక్ష్మి బ్యాంక్ 2023 మార్చి నాటికి కేవలం రూ. 15 వేల కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉంది. బ్యాంక్ నాయకత్వానికి సంబంధించి చాలా కాలంగా గందరగోళం నెలకొంది. దీంతో ఈ బ్యాంక్‌పై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచిన ఆర్బీఐ బోర్డులో ఇద్దరు డైరెక్టర్లను ఉంచింది. -
తెలంగాణ యువతి కిడ్నాప్ కేసు ఛేదన
తిరుమల : మతిస్థిమితంలేని యువతి అదృశ్యం కేసును తిరుమల పోలీసులు ఛేదించారు. తిరుమల ఏఎస్పీ మహేశ్వరరాజు కథనం..తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కొత్తగూడెం గాంధీనగర్‌కు చెందిన కె.ధనలక్ష్మి(23) కుటుంబ సభ్యులతో ఈనెల 9న తిరుమలకు వచ్చారు. అయితే పీఏసీ–1లో నిద్రిస్తుండగా ఆమె వేకువజామున 1.37 గంటలకు అదృశ్యమైంది. ఇది గుర్తించిన ఆమె సోదరుడు దుర్గాప్రసాద్ ఉదయం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సోదరికి మతిస్థిమితం లేదని ఎవరైనా తీసుకుపోతే వారి వెంటే వెళుతుందని, భోజనం పెడితే తింటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పీఏసీ–1 సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ధనలక్ష్మిని నిద్ర లేపి చేయి పట్టుకుని ఓ వ్యక్తి తీసుకెళ్లడం, అక్కడ నుంచి కమాండర్ జీపులో తీరుపతికి తీసుకెళ్లే దృశ్యాలు రికార్డు అయి ఉండటంతో క్లూ లభించినట్లైంది. తిరుపతి రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీ రికార్డులను పరిశీలిస్తే వేకువజామున 2.43 గంటలకు రైలు ఎక్కి చెన్నైకు వెళ్లినట్లు గుర్తించారు. నిందితుడు తిరుమలకు వచ్చినప్పుడు అతను తన వెంట తెచ్చిన బ్యాగు తిరుగు ప్రయాణంలో లేకపోవడాన్ని గమనించారు. పీఏసీ–1 లో ఆ బ్యాగ్‌ను అతను వదిలిపెట్టి వెళ్లడంతో నిందితుడి వివరాలు ఇట్టే తెలుసుకోగలిగారు. ఓ కంపెనీలో అతను పనిచేస్తున్నట్టు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులు పోలీసులకు లభ్యమయ్యాయి. ఆ కంపెనీ యాజమాన్యాన్ని పోలీసులు సంప్రదించి మరిన్ని వివరాలు సేకరించారు. అతని పేరు అర్జున్ దాస్ అని తెలుసుకున్నారు. అంతేకాకుండా కాల్ డేటా అతను చెన్నైలోనే ఉన్నట్లు గుర్తించి, ఎట్టకేలకు అతడిని అరెస్ట్ చేశారు. ధనలక్ష్మిని పెళ్లి చేసుకునేందుకు తీసుకెళ్లి, ఆమెకు మతిస్థిమితం లేదని గ్రహించాక అర్జున్‌దాస్ ఆమెను చెన్నై ఎగ్మూర్ స్టేషన్లో విడిచి పెట్టినట్లు విచారణలో తేలింది. రైల్వే పోలీసులు ఆమెను ఒక హోమ్‌లో చేర్చినట్లు తెలుసుకున్నారు. ఆ హోమ్ నుంచి ధనలక్ష్మిని తీసుకొచ్చిన పోలీసులు సోమవారం సాయంత్రం ఆమె తల్లిదండ్రులకు అప్పటించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
వర్మను నమ్మడం మాఖర్మ..!
తూర్పుగోదావరి, పిఠాపురం: మాపార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడడానికి అభ్యర్థులు లేరని ఎన్నికల్లో నిలబడి తమ పరువు నిలబెట్టాలని బతిమలాడితే రాజకీయాలపై ఆసక్తి లేకపోయినా ఆయన మాటలు నమ్మి ఎన్నికల్లో నిలబడి మెజార్టీ సాధించి పెడితే అవసరం తీరాకా అవతలికి తగిలేస్తున్నారని ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తీరుపై పిఠాపురం మండలం భోగాపురం ఎంపీటీసీ (టీడీపీ) అల్లుమల్లు ధనలక్ష్మి కృష్ణారావు మండిపడ్డారు. కొన్ని నెలలుగా తమను పక్కన పెట్టి ఇతర నాయకులు అధికారులతో అభివృద్ధి పనులు చేయిస్తూ తమను అవమానిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆమె ఎమ్మెల్యే వర్మ తీరుకు నిరసనగా తన ఎంపీటీసీ పదవితో పాటు తెలుగదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం తన రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను తనకు సంబంధం లేకుండా ఏవిధమైన సమాచారం ఇవ్వకుండా అధికారులతో చేయిస్తున్నారన్నారు. తాను సిఫార్సు చేసిన వారికి కాపు కార్పొరేషన్ రుణాల రాకుండా తీయించేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా ఒక నియంతగా పని చేస్తున్న ఎమ్మెల్యే వర్మ ప్రజల చేత ఎన్నుకోబడిన తనను ఒక మహిళను అనే విజ్ఞత కూడా లేకుండా పక్కన పెట్టారన్నారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకునే ఎమ్మెల్యే వర్మ టీడీపీకి కష్టకాలంలో నిలబడి ఒక ఎంపీటీసీ పదవిని తెచ్చిపెట్టిన తనను అవమానిస్తు ఆడబడుచులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. చివరకు గ్రామదర్శిని కార్యక్రమానికి సైతం తనకు సమాచారం ఇవ్వకుండా అవమానించిన ఎమ్మెల్యే వర్మను నమ్మడం నిజంగా తమ ఖర్మేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు ఉన్న తనను అణగదొక్కడానికి కొంత కాలంగా ఇతర నాయకులకు ప్రాముఖ్యత కల్పిస్తు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణం జరుగుతున్నా పార్టీపై ఉన్న నమ్మకం అభిమానం ప్రజలు తనకు ఇచ్చిన పదవిని వమ్ము చేయకూడదన్న ఒకే ఒక్క పట్టుదలతో ఇన్ని రోజులు ఇబ్బందులు ఎదుర్కొన్నాని ఆమె తెలిపారు. అయితే గెలిపించిన ప్రజలు నాకు జరుగుతున్న అవమానాలను చూసి చలించి పోతున్నారని, పనుల గురించి ప్రశ్నిస్తున్నారని ఆమె తెలిపారు. ఇక ఎమ్మెల్యే ఇతర నాయకులు చేస్తున్న అవమానాలను తట్టుకోలేక రాజీనామా చేస్తున్నానని నమ్మించి నట్టేటముంచిన వర్మ ఓటమిని చూడడమే ధ్యేయంగా తాను పని చేస్తానని ఇలాంటి నమ్మక ద్రోహం మరే ఆడబడుచుకు జరగకుండా పోరాడతానని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే వర్మ దౌర్జన్యాన్ని నిరసిస్తూ నేడు ర్యాలీ కాకినాడ సిటీ: పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ప్రభుత్వ ఉద్యోగులపై చేస్తున్న దౌర్జన్యాన్ని నిరసిస్తూ మంగళవారం పిఠాపురం పురవీధుల్లో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం తెలిపారు. కాకినాడలో జిల్లా ఎన్జీఓ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గొల్లప్రోలులో శానిటరీ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న శివ లక్ష్మిని అవమానకరంగా తిట్టడమే కాకుండా మహిళ అని చూడకుండా ఆమెతో మురికి కాలవలోని పూడిక తీయించిన విధానాన్ని జిల్లా ఎంప్లాయీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఎమ్మెల్యే వర్మ చర్యలను నిరసిస్తూ పిఠాపురం పురవీధుల్లో చేపట్టనున్న నిరసన ర్యాలీకి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు తరలిరావాలని ఆశీర్వాదం పిలుపునిచ్చారు. ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జియాఉద్దీన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, నాయకులు వై.శ్రీనివాస్, నరసింహం, నాలుగో తరగతి ఉద్యోగ ఉద్యోగ సంఘ జిల్లా అధ్యక్షుడు వైఎన్ సత్యనారాయణమూర్తి, వీఆర్వోల సంఘ జిల్లా అధ్యక్షుడు సాయిరెడ్డి, నీలపాల వీరబాబు, నాగేశ్వరరావు, మూర్తిబాబు, కృష్ణ, నారాయణ, రామాంజనేయులు, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీలో భగ్గుమన్న విభేదాలు బిక్కవోలు (అనపర్తి): బిక్కవోలు గ్రామ తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఉన్న వర్గ విభేదాలు సోమవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే సమక్షంలోనే వ్యతిరేక వర్గాలు రెండు తీవ్ర పదజాలంతో ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుని దాడులకు తెగబడే యత్నం చేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీకి చెందిన నాయకులు తమ పదవులకు పార్టీకి రాజీనామా చేస్తున్నామంటు ప్రకటించి మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు బీసీలకు పెద్దపీట వేస్తామని నమ్మబలికి ఆధికారంలోకి వచ్చిన తరువాత బీసీలను విస్మరించి అసలు ప్రజలకు సంబంధం లేకుండా నామినేటెడ్ పదవిలో ఉన్న ఊలపల్లికి చెందిన సురేష్‌రెడ్డికి బిక్కవోలు గ్రామం పై పెత్తనం అప్పగించడమేమిటంటు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడడమే కాకుండా ఆస్తులు అమ్ముకున్నామని, అయినా తమను పక్కన పెట్టి తీవ్ర అన్యాయం చేశారని గ్రామానికి సంబంధం లేని వ్యక్తులకు గ్రామ పెత్తనాన్ని అప్పగించడం పై ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు గంటలకు విలేకర్ల సమావేశం పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న నాయకులు సాయంత్రానికి ఎమ్మెల్యే నుంచి పిలుపు రావడంతో శాంతించారు. సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. అయితే రచ్చకెక్కిన విభేదాల నేపథ్యంలో పార్టీపై వారి విధేయత ఏ మేరకు ఉంటుందో, ఎమ్మెల్యే విశ్వాసాన్ని పొందడం సాధ్యమేనా అనే విషయం పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్య
పెద్దవడుగూరు : మండలంలోని భీమునిపల్లిలో భాస్కర్‌రెడ్డి భార్య ధనలక్ష్మీ(28) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రమణారెడ్డి తెలిపారు. పెళ్లై పదేళ్లవుతున్నా పిల్లలు పుట్టకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ మంగళవారం మరోసారి గొడవపడ్డారని వివరించారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారన్నారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మరణించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి తండ్రి తిరుపాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.