ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో దూకి మహిళ ఆత్మహత్య ! | woman suicide in yellampalli project | Sakshi
Sakshi News home page

ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో దూకి మహిళ ఆత్మహత్య !

Sep 3 2015 12:34 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీనంగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద గురువారం వెలుగులోకి వచ్చింది.

రామగుండం : ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీనంగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా పనులు నిర్వహించుకుంటున్న కొందరు వ్యక్తులు బ్రిడ్జిపై హ్యాండ్ బ్యాగ్ ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని హ్యాండ్‌బ్యాగ్‌ను పరిశీలించారు.

అందులోభాగంగా ఓ చీటి కనిపించింది. అందులో.. రామగుండం మండలం గూడూరు గ్రామానికి చెందిన గాజుల పద్మగా రాసి ఉంది. అలాగే ఆమె స్థానిక దక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్‌గా పనిచేసినట్లు ఆధారాలు లభించాయి. దాంతో పోలీసులు బ్యాంకు ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు.  అయితే పద్మ మృతికి గల కారణాలు తెలియరాలేదు. అలాగే పద్మ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement