మహిళ దారుణ హత్య | woman murder in jallipalli | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

May 24 2017 11:57 PM | Updated on Sep 5 2017 11:54 AM

కూడేరు మండలం జల్లిపల్లికి చెందిన కురుబ రాజన్న భార్య అనసూయమ్మ(40)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కూడేరు (ఉరవకొండ) : కూడేరు మండలం జల్లిపల్లికి చెందిన కురుబ రాజన్న భార్య అనసూయమ్మ(40)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మకూరు సీఐ శివనారాయణస్వామి కథనం మేరకు.. అనసూయమ్మ మంగళవారం ఉదయమే ఇంటి నుంచి కాపరితో కలసి గొర్రెలను తోలుకొని పీఏబీఆర్‌ డ్యాం ప్రాంతానికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు భార్యను ఇంటికి పంపేందుకు రాజన్న వెళ్లగా ఆమె కనిపించలేదు.

చుట్టు పక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు.  దీంతో అతను పోలీసు స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఆ తరువాత అదే ఏటి ప్రాంతంలో గాలించగా..ఆమె హత్యకు గురై ఉండగా కనుగొన్నారు. అయితే ఆమె మెడ, చెవిలోని బంగారు కమ్మలు, గొలుసు కనిపించకపోవడంతో నగల కోసమే చంపేసినట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement