స్కూటర్‌ను ఢీకొన్న లారీ.. మహిళ మృతి | Woman killed in road accident | Sakshi
Sakshi News home page

స్కూటర్‌ను ఢీకొన్న లారీ.. మహిళ మృతి

Apr 20 2016 2:02 PM | Updated on Aug 30 2018 4:07 PM

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఉంగటూరు మండలానికి చెందిన ఆదినారాయణ, బాపనమ్మ (56) దంపతులు స్కూటర్‌పై రాజమండ్రిలోని బంధువుల ఇంట జరగనున్న వివాహ వేడుకకు వెళుతున్నారు.

 

దొమ్మేరు సమీపంలో వీరి వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. వారిద్దరూ కిందపడిపోగా బాపనమ్మ తలపై నుంచి లారీ చక్రం వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆదినారాయణ తలకు హెల్మెట్ పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

Advertisement
 
Advertisement
Advertisement