జీడిమెట్లకు చెందిన యువతి ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికివెళ్లి తిరిగి రాలేదు.
మేడ్చల్: జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లకు చెందిన యువతి ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికివెళ్లి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల వద్ద ఆరాతీసిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్థానికంగా నివాసముంటున్న ఉల్లాస పాపారావు కుమార్తె దేవి(18) ఈ నెల 7న ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు దీంతో పాపారావు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.