రైల్లోంచి పడి మహిళ మృతి | Woman falls from moving train, dies | Sakshi
Sakshi News home page

రైల్లోంచి పడి మహిళ మృతి

Jun 21 2016 9:14 PM | Updated on Jul 11 2019 8:56 PM

రుక్మాపూర్-తాండూరు రైల్వేస్టేషన్ల మధ్య ప్రమాదవశాత్తు ఓ మహిళ రైల్లో నుంచి కిందపడి మృతి చెందింది.

తాండూరు: రుక్మాపూర్-తాండూరు రైల్వేస్టేషన్ల మధ్య ప్రమాదవశాత్తు ఓ మహిళ రైల్లో నుంచి కిందపడి మృతి చెందింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని మహిళ శవం రైలు పట్టాల వద్ద పడి ఉంది. ఇది గమనించి పక్కనే ఉన్న ట్రాక్ మన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ ప్రమాదవశాత్తు కిందపడి మరణించినట్లు నిర్ధారించుకున్నారు. మృతురాలికి సంబంధించిన ఎటువంటి వివరాలు తెలియరాలేదని తెలిపారు. రైల్లో భిక్షాటన చేసే ఆమెగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement