ఆటో బోల్తా : మహిళ మృతి | woman dies of auto rolls | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : మహిళ మృతి

Feb 23 2017 11:16 PM | Updated on Mar 9 2019 4:28 PM

ఆటో బోల్తా : మహిళ మృతి - Sakshi

ఆటో బోల్తా : మహిళ మృతి

గుమ్మఘట్ట మండలం సిరిగేదొడ్డి క్వారీ సమీపంలో గురువారం సాయంత్రం ఓ ఆటో బోల్తాపడిన ప్రమాదంలో తాళ్లకెరకు చెందిన హనుమక్క(68) అనే మహిళ మృతి చెందగా, మరో 15మందికి గాయాలయ్యాయి.

- 15మందికి గాయాలు  
గుమ్మఘట్ట : గుమ్మఘట్ట మండలం సిరిగేదొడ్డి క్వారీ సమీపంలో గురువారం సాయంత్రం ఓ ఆటో బోల్తాపడిన ప్రమాదంలో తాళ్లకెరకు చెందిన హనుమక్క(68) అనే మహిళ మృతి చెందగా, మరో 15మందికి గాయాలయ్యాయి. గుమ్మఘట్ట ఎస్‌ఐ హైదర్‌వలీ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.  

            రాయదుర్గం పట్టణం నుంచి 24మంది ప్రయాణికులతో ఓ ఆటో అడిగుప్ప మీదుగా తాళ్లకెర గ్రామానికి బయలుదేరింది. సిరిగేదొడ్డి క్వారీ సమీపంలోకి రాగానే డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తాళ్లకెరకు చెందిన హనుమక్క, చ్‌ మారెక్క, గురుమూర్తి, హెచ్‌ శివమ్మ, మారెక్క, సోమణ్ణ, రంగసముద్రంకు చెందిన జగదీష్, మల్లక్క, వరలక్ష్మి, నాగచంద్రారెడ్డి, తిప్పేస్వామి, లక్ష్మి, రఘునాథరెడ్డి, కోనాపురానికి చెందిన గొల్ల కమలమ్మ తీవ్ర గాయాలపాలయ్యారు.

క్షతగాత్రులను అటుగా వెళ్తున్న యువకులు 108 ద్వారా రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ హనుమక్క మృతి చెందింది. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ గౌని కాంతారెడ్డి, నాయకుడు కొత్తపల్లి సత్యనారాయణరెడ్డి, పీపీ పాలయ్య, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులకు సూచించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement