వేధింపులతో వివాహిత ఆత్మహత్య | woman commits suicide due to harassment | Sakshi
Sakshi News home page

వేధింపులతో వివాహిత ఆత్మహత్య

Aug 9 2016 12:11 PM | Updated on Sep 26 2018 6:15 PM

వేధింపుల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వేములవాడలో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది.

వేములవాడ: వేధింపుల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వేములవాడలో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. పట్టణానికి చెందిన నాగరాజు, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే, సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీదేవి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శివ అనే వ్యక్తి కొద్ది రోజులుగా ఆమెను వేధిస్తున్నాడని, తీవ్ర మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement