కోవూరులో యువతి దారుణ హత్య | woman brutally murdered in nellore district | Sakshi
Sakshi News home page

కోవూరులో యువతి దారుణ హత్య

Aug 19 2016 12:02 PM | Updated on Sep 4 2017 9:58 AM

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది.

కోవూరు : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. గ్రామంలోని సాయిఎన్‌క్లేవ్ లేఔట్‌లో గుర్తు తెలియని యువతి (25) మృతదేహం పడింది. శుక్రవారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతిని ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి సంఘటన స్థలిని పరిశీలించారు. క్లూస్‌టీంను రప్పించిన కేసు విచారణ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement