షార్ట్‌సర్క్యూట్‌తో ఆస్పత్రి దగ్ధం | with shart circuit hospital burn | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్క్యూట్‌తో ఆస్పత్రి దగ్ధం

Sep 10 2016 11:37 PM | Updated on Sep 4 2017 12:58 PM

షార్ట్‌సర్క్యూట్‌తో ఆస్పత్రి దగ్ధం

షార్ట్‌సర్క్యూట్‌తో ఆస్పత్రి దగ్ధం

షార్ట్‌ సర్క్యూట్‌తో పట్టణంలోని ఓ ఆస్పత్రి దగ్ధమైంది. ఈ ఘటన భువనగిరిలో శుక్రవారం రాత్రి చేసుకుంటుంది. వివరాలు.. పట్టణంలోని పల్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి విద్యుత్‌ మెయిన్‌బోర్డులో అర్ధరాత్రి దాటిన తరువాత మంటలు లేచాయి.

– రూ.లక్షల ఆస్తి నష్టం
భువనగిరి అర్బన్‌  
షార్ట్‌ సర్క్యూట్‌తో పట్టణంలోని ఓ ఆస్పత్రి దగ్ధమైంది. ఈ ఘటన భువనగిరిలో శుక్రవారం రాత్రి చేసుకుంటుంది. వివరాలు.. పట్టణంలోని  పల్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి విద్యుత్‌ మెయిన్‌బోర్డులో అర్ధరాత్రి దాటిన తరువాత మంటలు లేచాయి. దీంతో ఆస్పత్రి అంతా మంటలు వ్యాపించి ముందు, పై భాగం, మెడికల్‌ షాపు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆస్పత్రిలో నుంచి మంటలు, పొగలు వస్తున్న విషయాన్ని గమనించి స్థానికులు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించగా వారు వచ్చి  మంటలను ఆర్పివేశారు. ఈ మేరకు రూ. 15 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ఆస్పత్రి యాజమాని డాక్టర్‌ ఓవైసి తెలిపారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement