ఆదోని పిలిప్స్‌ జట్టు విజయకేతనం | winner is adoni philips team | Sakshi
Sakshi News home page

ఆదోని పిలిప్స్‌ జట్టు విజయకేతనం

Dec 25 2016 11:38 PM | Updated on Aug 24 2018 6:44 PM

ఆదోని పిలిప్స్‌ జట్టు విజయకేతనం - Sakshi

ఆదోని పిలిప్స్‌ జట్టు విజయకేతనం

ఎల్లార్తి షేక్‌షావలి, షాషావలి ఉరుసును పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌వి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటిల్లో ఆదోని పిలిప్స్‌ జట్టు విజేతగా నిలిచింది. దర్గా పీఠాధిపతి, ముతవల్లి డాక్టర్‌ సయ్యద్‌ షేక్‌ తాజుద్దిన్‌ అహమ్మద్‌ ఖాద్రి ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి పోటీలు నిర్వహిస్త్నునారు.

- ఎల్లార్తిలో ముగిసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
- విజేత జట్లకు నగదు బహుమతులు ప్రదానం
 
హొళగుంద: ఎల్లార్తి షేక్‌షావలి, షాషావలి ఉరుసును పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌వి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటిల్లో ఆదోని పిలిప్స్‌ జట్టు విజేతగా నిలిచింది. దర్గా పీఠాధిపతి, ముతవల్లి డాక్టర్‌ సయ్యద్‌ షేక్‌ తాజుద్దిన్‌ అహమ్మద్‌ ఖాద్రి ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి పోటీలు నిర్వహిస్త్నునారు. ఆదివారం ఆదోని-గంగావతి జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఆదోని పిలిప్స్‌ జట్టుకు రూ. 20 వేల నగదును బళ్లారి జిల్లాకు చెందిన సూగప్ప అందించారు. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు వరుసగా  మంత్రాలయం మఠానికి చెందిన వీరేంద్రాచారి, మారుతిబాలు రూ. 15వేలు, రూ.10 వేలు ప్రకారం అందించారు. ఆలూరు సీఐ శంకరయ్య, ఎస్‌ఐ మారుతి, ఎల్లార్తి దర్గా పీఠాధిపతి డాక్టర్‌ సయ్యద్‌ షేక్‌ తాజుద్దిన్‌ అహమ్మద్‌ ఖాద్రి చేతుల మీదుగా బహుమతులు అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement