దుప్పిపై కుక్కల దాడి.. కాపాడిన స్థానికులు | wild animal saved by native people of srikakulam | Sakshi
Sakshi News home page

దుప్పిపై కుక్కల దాడి.. కాపాడిన స్థానికులు

Mar 28 2016 8:17 AM | Updated on Sep 3 2017 8:44 PM

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ ప్రాంతంలో పునాదుల్లో పడిపోయిన ఓ దుప్పిని స్థానికులు రక్షించారు.

పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ ప్రాంతంలో పునాదుల్లో పడిపోయిన ఓ దుప్పిని స్థానికులు రక్షించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు భవనాల నిర్మాణానికి తీసిన పునాదుల గుంటల్లో ఆదివారం రాత్రి ఓ దుప్పి పడిపోయింది. దీనిపై కుక్కుల దాడి చేసి గాయపరిచాయి. అయితే, కుక్కల అరుపులతో ఇందిరమ్మ కాలనీకి చెందిన కొందరు యువకులు అక్కడికి చేరుకుని దుప్పిని కాపాడి సోమవారం ఉదయం అటవీ అధికారులకు అప్పగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement