కళాకారులను ఆదుకుంటాం | we will help to artists | Sakshi
Sakshi News home page

కళాకారులను ఆదుకుంటాం

Jul 21 2016 8:54 PM | Updated on Aug 20 2018 6:47 PM

కళాకారులను ఆదుకుంటాం - Sakshi

కళాకారులను ఆదుకుంటాం

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంతో ఉందని, ప్రత్యేక రాష్ట్రంలో వారిని అన్ని విధాలా ఆదుకుంటామని శాసనసభ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు.

  • గద పట్టిన స్పీకర్‌ మధుసూదనాచారి
  • గణపురం : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంతో ఉందని, ప్రత్యేక రాష్ట్రంలో వారిని అన్ని విధాలా ఆదుకుంటామని శాసనసభ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురువారం నిర్వహించిన చిందు కళాకారుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అంతకుముందు కళాకారులు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించగా, స్పీకర్‌ కూడా వారితో కలిసి గద పట్టుకుని, బాణం ఎక్కుపెట్టి ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం కళాకారులతో కలిసి గణప సముద్రం కట్టపై మొక్కలు నాటారు.

Advertisement
 
Advertisement
Advertisement