ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి | we festival celeberetated piease whether | Sakshi
Sakshi News home page

ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి

Aug 31 2016 11:53 PM | Updated on Oct 1 2018 6:33 PM

ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి - Sakshi

ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి

వినాయకచవితి, బక్రీద్‌వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్‌ఐ ప్యారసాని శీనయ్య కోరారు. బుధవారం మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన శాంతిసంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.

రామన్నపేట
వినాయకచవితి, బక్రీద్‌వేడుకలను  ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్‌ఐ ప్యారసాని శీనయ్య కోరారు.  బుధవారం మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన శాంతిసంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.  మట్టి వినాయకులనే ప్రతిష్టించాలని, మంటపాల ఏర్పాటుకు పోలీస్‌శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని చెప్పారు.  శబ్దకాలుష్యానికి కారణమయ్యే డీజేల ఏర్పాటుకు అనుమతిలేదని స్పష్టం చేశారు. ఉదయం ఆరుగంటలనుంచి రాత్రి పదిగంటలవరకు మాత్రమే మైక్‌ను ఉపయోగించ వలసి ఉంటుందని చెప్పారు.  సమావేశంలో పీఎస్‌ఐ పైడినాయుడు, సర్పంచ్‌ నకిరేకంటి మొగులయ్య, వివిధపార్టీల నాయకులు బందెల రాములు, బట్టె క్రిష్ణమూర్తి, మీర్జా బషీర్‌బేగ్, సాల్వేరు అశోక్, వనం చంద్రశేఖర్, ఎండీ నాజర్, జమీరుద్దిన్,  గొలుసుల ప్రసాద్, ఎం.శంకర్, మన్సూర్‌అలీ, బండ లింగస్వామి, మిర్యాల మల్లేశం పోలీస్‌సిబ్బంది ఆరోగ్యరాజ్, నర్సింహ, క్రిష్ణమూర్తి పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement