చివరి ఆయకట్టు రైతులకూ నీరందిస్తాం | water supply to last feilds | Sakshi
Sakshi News home page

చివరి ఆయకట్టు రైతులకూ నీరందిస్తాం

Sep 8 2016 12:35 AM | Updated on Oct 1 2018 5:41 PM

జూరాల చివరి ఆయకట్టు కాల్వలకు సాగునీరందించి రైతులను ఆదుకుంటామని జూరాల ఎస్‌ఈ రఘునాథరావు అన్నారు. బుధవారం ఆయన కొం డూరులోని బ్రాంచ్‌ కెనాల్, డీ40 కాల్వలను పరిశీలించారు. కాల్వల్లో జమ్ము, గడ్డి, మట్టి పేరుకుపోవడంతో చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందడం లేదని, వీటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయించేందుకు అవసరమైన నివేదికలను రెండు రోజుల్లో తయారు చేయాలని ఆయన జూరాల ఈఈ శ్రీధర్, శ్రీనివాసరావులను ఆదేశించారు.

వీపనగండ్ల: జూరాల చివరి ఆయకట్టు కాల్వలకు సాగునీరందించి రైతులను ఆదుకుంటామని జూరాల ఎస్‌ఈ రఘునాథరావు అన్నారు. బుధవారం ఆయన కొం డూరులోని బ్రాంచ్‌ కెనాల్, డీ40 కాల్వలను పరిశీలించారు. కాల్వల్లో జమ్ము, గడ్డి, మట్టి పేరుకుపోవడంతో చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందడం లేదని, వీటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయించేందుకు అవసరమైన నివేదికలను రెండు రోజుల్లో తయారు చేయాలని ఆయన జూరాల ఈఈ శ్రీధర్, శ్రీనివాసరావులను ఆదేశించారు. గోపల్‌దిన్నె రిజర్వాయర్‌ నుంచి కాల్వకు నీరు అవసరమైన మేరకు విడుదల చేస్తున్నా కాల్వలు సరిగాలేకపోవడంతో రైతులకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. దీనిని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని  రైతులకు భరోసా ఇచ్చారు. ఆయనతోపాటు డీఈ రహిమోద్దీన్, ఏఈలు వెంకట్‌రామారెడ్డి, శశిధర్, కిరణ్, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement