తీరనున్న గ్రేటర్ వరంగల్ ప్రజల దాహార్తి | water supply to grater Warangal from Devadula will start today | Sakshi
Sakshi News home page

తీరనున్న గ్రేటర్ వరంగల్ ప్రజల దాహార్తి

Apr 26 2016 11:06 AM | Updated on Sep 29 2018 5:21 PM

తీరనున్న గ్రేటర్ వరంగల్ ప్రజల దాహార్తి - Sakshi

తీరనున్న గ్రేటర్ వరంగల్ ప్రజల దాహార్తి

మంచినీళ్ల కోసం గ్రేటర్ వరంగల్ వాసులు పడుతున్న ఇబ్బందులు అతి త్వరలో తీరనున్నాయి. ఏటూరునాగారం మండలంలోని దేవాదుల నుంచి మంగళవారం నీటి పంపింగ్ ప్రారంభంకానుంది.

ఏటూరునాగారం: మంచినీళ్ల కోసం గ్రేటర్ వరంగల్ వాసులు పడుతున్న ఇబ్బందులు అతి త్వరలో తీరనున్నాయి. ఏటూరునాగారం మండలంలోని  దేవాదుల నుంచి మంగళవారం నీటి పంపింగ్ ప్రారంభంకానుంది. ఇందుకు వీలుగా అధికారులు గోదావరి ఒడ్డున 16 మోటార్లను ఏర్పాటు చేశారు.

గోదావరి నీటిని ఫోర్‌బేలకు మళ్లించి అక్కడి నుంచి భీంఘన్‌పూర్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి పులకుర్తి, ధర్మసాగర్‌కు నీరు చేరుతుంది. అక్కడి నుంచి గ్రేటర్ వరంగల్ ప్రజలకు నీటి సరఫరా జరుగుతుంది. గురువారం నాటికి వరంగల్ ప్రజలకు తాగు నీరు అందనుంది. దీంతో నీటి కష్టాలు తీరనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement