ఆయిటిపాముల రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలి | water realesed to Aeitipamula Rervioer | Sakshi
Sakshi News home page

ఆయిటిపాముల రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలి

Sep 15 2016 11:23 PM | Updated on Sep 4 2017 1:37 PM

ఆయిటిపాముల రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలి

ఆయిటిపాముల రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలి

మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్‌కు ఉదయ సముద్రం నుంచి మంచినీటిని విడుదల చేయాలని సీపీఎం డివిజన్‌ కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ డిమాండ్‌ చేశారు.

కట్టంగూర్‌:
మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్‌కు ఉదయ సముద్రం నుంచి మంచినీటిని విడుదల చేయాలని సీపీఎం డివిజన్‌ కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం కట్టంగూర్‌లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి మండలాల పరిధిలోని సుమారు 40 గ్రామాలకు మంచి నీరు అందించే అయిటిపాముల రిజర్వాయర్‌ అడుగంటిపోయినా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. ప్లాంటు నిర్వహణ సక్రమంగా లేకపోవటంతో మురుగు నీరు సరఫరా అవుతున్నా సంబందిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే నీటిని విడుదల చేసి ఆయా గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మామిడి సర్వయ్య, మండల కార్యదర్శి నంద్యాల వెంకట్‌రెడ్డి, నాయకులు మురారి మోహన్, సైదులు, దర్మారెడ్డి, సురేందర్, యాదగిరి, గణేష్, విజయ్, చిట్యాల రాజిరెడ్డి, అవిలయ్య పాల్గొన్నారు.







 

Advertisement
 
Advertisement
Advertisement