బండెక్కిన బిందెలు | water problem in naranagepalli | Sakshi
Sakshi News home page

బండెక్కిన బిందెలు

Apr 29 2017 11:41 PM | Updated on Sep 5 2017 9:59 AM

బండెక్కిన బిందెలు

బండెక్కిన బిందెలు

మండలంలోని నారనాగేపల్లిలో తాగునీటి సమస్య తాండవిస్తోంది. గ్రామంలో 400 ఇళ్లు, 2 వేలకు పైగా జనాభా ఉంది.

రొద్దం (పెనుకొండ) : మండలంలోని నారనాగేపల్లిలో తాగునీటి సమస్య తాండవిస్తోంది. గ్రామంలో 400 ఇళ్లు, 2 వేలకు పైగా జనాభా ఉంది. గ్రామంలో మూడు నెలలుగా తాగునీటి సమస్య నెలకొంది. దీంతో గ్రామస్తులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక రాష్ట్రం పెండ్లిజీవి గ్రామం పెన్నానది వద్ద ఉన్న చేతిపంపును ఆశ్రయిస్తున్నారు. భగభగ మండే ఎండను సైతం లెక్క చేయకుండా కాలి నడకన, ఎద్దుల బండ్లలో వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు.
సమస్య పరిష్కరిస్తాం : - మనోహర్‌, సర్పంచ్‌, నారనాగేపల్లి
భూగర్భజలాలు అడుగంటిపోవడంతో సమస్య ఏర్పడింది. టాంకర్ల ద్వారా కొన్ని రోజులు నీటిని సరఫరా చేశాం. తర్వాత అధికారులు ఒప్పుకోకపోవడంతో ట్యాంకర్లను ఆపేశాం. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతాం.

Advertisement
 
Advertisement
Advertisement