అనారోగ్యంతో ఇల్లంతకుంట మండలం గుండారం గ్రామ నివాసి, సిరిసిల్ల మండలం నర్సింహులపల్లి వీఆర్వో ఎలుక బాబు (45) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాబు ఆర్నెల్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ఇల్లంతకుంట : అనారోగ్యంతో ఇల్లంతకుంట మండలం గుండారం గ్రామ నివాసి, సిరిసిల్ల మండలం నర్సింహులపల్లి వీఆర్వో ఎలుక బాబు (45) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాబు ఆర్నెల్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. మృతుడికి భార్య విజయ, కుమారుడు ఉన్నారు.
బాబు మృతదేహాన్ని పరిశీలించిన తహసీల్దార్
సిరిసిల్ల రూరల్ : బాబు మృతదేహాన్ని సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా.. తోటి వీఆర్వోలు కంటతడిపెట్టారు. తహసీల్దార్ రాజు మృతదేహన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. తాత్కాలిక సాయం కింద రూ.20వేల సాయాన్ని రెవెన్యూశాఖ తరఫున అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇల్లంతకుంట ఏఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు.