క్రీడాకారిణి ఆత్మహత్య | volleyball player commits suicide | Sakshi
Sakshi News home page

క్రీడాకారిణి ఆత్మహత్య

Nov 16 2016 8:38 PM | Updated on Nov 6 2018 7:56 PM

చించుపల్లి మండలం రుద్రంపూర్‌లో బుధవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది.

కొత్తగూడెం: చించుపల్లి మండలం రుద్రంపూర్‌లో బుధవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రావ్య(17) అనే బాలిక ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. శ్రావ్య స్థానిక డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతోంది. తల్లిదండ్రులు కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉన్నత చదువులు చదివే ఆర్థిక స్తోమత లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

తన చావుకు ఎవరూ కారణం కాదని, ఉన్నత చదువులు చదువుకునే స్తోమత తనకు లేదని, ఆర్ధిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె సూసైడ్‌నోట్‌లో పేర్కొంది. శ్రావ్య జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి కూడా. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement