మద్యం దుకాణానికి తాళం వేసిన గ్రామస్తులు | villagers locked liquor shop in yedlapadu | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణానికి తాళం వేసిన గ్రామస్తులు

Jul 26 2015 3:15 PM | Updated on Sep 3 2017 6:13 AM

మద్యం దుకాణానికి తాళం వేసిన గ్రామస్తులు

మద్యం దుకాణానికి తాళం వేసిన గ్రామస్తులు

నివాసాల మధ్య మద్యం దుకాణం నిర్వహిస్తూ.. ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తుండటాన్ని గ్రామస్తులు దైర్యంగా ఎదిరించారు.

గుంటూరు: నివాసాల మధ్య మద్యం దుకాణం నిర్వహిస్తూ.. ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తుండటాన్ని గ్రామస్తులు దైర్యంగా ఎదిరించారు. మద్యం దుకాణాలను  నిరసిస్తూ.. గ్రామస్థులంతా కలిసి మద్యం దుకాణానికి తాళం వేసిన సంఘటన గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలో చోటుచేసుకుంది. ఎడ్లపాడు మండల కేంద్రంలో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని మూసివేయాలని గతంలో పలుమార్లు సూచించినా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు మద్యం దుకాణాన్ని మూసివేయించి తాళం వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement