కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెజవాడ కుర్రోడి సినిమా | Vijayawada boy Raja Pothineni's short film selected for Cannes Film | Sakshi
Sakshi News home page

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెజవాడ కుర్రోడి సినిమా

May 16 2016 11:59 PM | Updated on Sep 4 2017 12:14 AM

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెజవాడ కుర్రోడి సినిమా

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెజవాడ కుర్రోడి సినిమా

ఫ్రాన్స్‌లోని కాన్స్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 69వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెజవాడ కుర్రోడి లఘుచిత్రం కనువిందు చేయనుంది.

- స్కూల్ ఫిలిం క్యాటగిరీలో ఎంపికైన '60 ఎయిట్'

విజయవాడ (లబ్బీపేట): ఫ్రాన్స్‌లోని కాన్స్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 69వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెజవాడ కుర్రోడి లఘుచిత్రం కనువిందు చేయనుంది. స్కూల్ ఫిలిం విభాగంలో విజయవాడ కుర్రాడు రాజానిషాంత్ పోతినేని రూపొందించిన షార్ట్ ఫిల్మ్ '60 ఎయిట్'  కాన్స్ లో ప్రదర్శించనున్నారు. 15 నిమిషాల నిడివి గల ఈ ఫిక్షనల్ డ్రామా కథను తానే రాసి, రూపొందించాడు రాజా నిషాంత్.

'60 ఎయిట్' చిత్ర కథనం ప్రధానంగా ఎనిమిదేళ్ల బాలుడు జాన్ చుట్టూ తిరుగుతుంది. 8 ఏళ్ల వయస్సులో ప్రమాదానికి గురై అప్పటి మానసిక పరిస్థితితోనే ఉన్న 52 సంవత్సరాల వ్యక్తి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల ఇతివృత్తమే ఈ కథాంశం. ఈ నెల 11న ప్రారంభమైన ఈ చిత్రోత్సవాలు 22 వరకూ జరగనున్నాయి. మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి బాహుబలి స్క్రీనింగ్ జరగనున్న విషయం తెలిసిందే. రాజానిషాంత్ విజయవాడలోని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.రమేష్‌బాబు కుమారుడు, సినీ హీరో రామ్‌కు వరుసకు సోదరుడు.

(చదవండి: కాన్స్‌లో మన హంగామా!)

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement