ఆన్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్స్‌ | Vehicles registration through online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్స్‌

Oct 14 2016 2:08 AM | Updated on Oct 20 2018 6:19 PM

ఆన్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్స్‌ - Sakshi

ఆన్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్స్‌

నెల్లూరు రూరల్‌ : వాహనాల రిజిస్ట్రేషన్స్‌ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు ఉప రవాణా శాఖ కమిషనర్‌ శివరాం ప్రసాద్‌ తెలిపారు. కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కళాశాల్లో ఆన్‌లైన్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌పై రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, ఆటోమొబైల్స్‌ డీలర్లకు గురువారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

నెల్లూరు రూరల్‌ :
వాహనాల రిజిస్ట్రేషన్స్‌ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు ఉప రవాణా శాఖ కమిషనర్‌ శివరాం ప్రసాద్‌ తెలిపారు. కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కళాశాల్లో ఆన్‌లైన్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌పై రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, ఆటోమొబైల్స్‌ డీలర్లకు గురువారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శిక్షణకు హాజరుకానీ డీలర్ల వద్దకు నేరుగా తమ సిబ్బంది వెళ్లి  శుక్రవారం వారికి అవగాహన కల్పిస్తారన్నారు. నెల్లూరు భార్గవి ఆటోమొబైల్‌ షోరూమ్‌లో ఈనెల 15వ తేదీన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాన్ని జిల్లా మంత్రి నారాయణ ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మోటారు తనఖీ అధికారులు, పరిపాలనాధికారులు, సీనియర్, జూనియర్‌ సహాయకులు, డీబీఏలు, డీలర్లు పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement