ఆర్టీఏ సర్వర్‌ డౌన్‌ | RTA server issues in Telangana | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ సర్వర్‌ డౌన్‌

Apr 25 2026 5:31 AM | Updated on Apr 25 2026 5:31 AM

RTA server issues in Telangana

రెండు రోజులుగా నిలిచిపోయిన పౌర సేవలు  

శుక్రవారం సాయంత్రానికి పునరుద్ధరణ

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీఏలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా రెండు రోజులుగా పౌరసేవలు నిలిచిపోయాయి. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, డ్రైవింగ్‌ టెస్ట్‌ట్రాక్‌లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొంతమంది వాహనదారులకు వాహన్‌సారథి పోర్టల్‌లో స్లాట్‌ల నమోదుకు ఆటంకాలు తలెత్తాయి. ఫీజుల చెల్లింపులకు సైతం ఇబ్బంది ఏర్పడింది. ఇలా రెండు రోజులపాటు గంటల తరబడి పౌర సేవలు స్తంభించడంతో వేల సంఖ్యలో లెర్నింగ్, డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల నమోదు, బదిలీలు, ఫిట్‌నెస్‌ పరీక్షలు తదితర సేవలు నిలిచిపోయాయి.

దీంతో వాహనదారులు ఆర్టీఏ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. అదే సమయంలో ఫీజులు, త్రైమాసిక పన్నులు వంటి చెల్లింపులకు ఇ–సేవ కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వచి్చంది. ఇ–సేవలో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని, శుక్రవారం సాయంత్రం అన్ని రకాల సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించామని హైదరాబాద్‌ జేటీసీ రమేశ్‌ తెలిపారు. 

పటిష్టంగా వాహన్‌ సేవలు: మరోవైపు గత నెలలో ప్రవేశపెట్టిన వాహన్‌ పోర్టల్‌ను సాంకేతికంగా మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 23,750 వాహనాలకు ఈ పోర్టల్‌ ద్వారా నమోదు సదుపాయం కల్పించారు. ఫ్యాన్సీ నంబర్లతో పా టు, వాహనాలకు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. కొన్ని సాంకేతిక సమస్యలను అధిగమించాల్సి ఉందని, మరో 15 రోజుల్లో వాహన్‌ సాంకేతిక సామ ర్థ్యం పూర్తిస్థాయిలో మెరుగవుతుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement