ఆత్రేయపురం‘వంగవీటి’ సినీ సందడి | vangaveeti movie shooting in atreyapuram | Sakshi
Sakshi News home page

ఆత్రేయపురం‘వంగవీటి’ సినీ సందడి

Jun 24 2016 9:12 AM | Updated on Aug 9 2018 7:30 PM

వర్మ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న వంగవీటి సినిమా సన్నివేశాలు ఆత్రేయపురం ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు.

ఆత్రేయపురం : వర్మ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న వంగవీటి సినిమా సన్నివేశాలు ఆత్రేయపురం ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. స్క్రీన్‌ప్లే, నిర్మాత, డెరైక్టర్ రామ్‌గోపాల్‌వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫ్యాక్షన్ రాజకీయాల కథా చిత్రంగా రూపొందిస్తున్నారు. స్థానిక మహా త్మాగాంధీ జూనియర్ కళాశాల వద్ద ఈ చిత్రంలోని హత్య సంఘటనలను చిత్రీకరించా రు. నూతన తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

కో డెరైక్టర్లుగా వేగేశ్న అజయ్‌వర్మ, మంజునాథ్‌తో పాటు తారాగణం వంశీ, శాండీ, ఇం ద్రతో పాటు పలువురు నూతన తారాగణం నటిస్తున్నారు. ప్యాక్షన్ గొడవలకు సంబంధించిన చిత్రం కావడంతో హీరోయిన్ లేకుండా రూపొందిస్తున్నట్టు ఆత్రేయపురం వాసి కో డెరైక్టర్ వేగేశ్న అజయ్‌వర్మ పేర్కొన్నా రు. ఈ చిత్రం లోని విలన్ పాత్రలను ఆత్రేయపురానికి చెంది న యువకులు నటించారు. ఆత్రేయపురం విజయవాడ, పెనుగొండ ప్రాంతాల్లో ఈ చిత్ర నిర్మాణాన్ని శరవేగంగా రూపొం దించి త్వరలో విడుదల చేయనున్నట్టు అజయ్‌వర్మ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement