వివాహేతర సంబంధం.. యువకుల దారుణ హత‍్య | Two youngsters murdered over Extra-marital affairs | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. యువకుల దారుణ హత‍్య

Feb 26 2017 8:44 AM | Updated on Jul 30 2018 8:37 PM

వివాహేతర సంబంధం.. యువకుల దారుణ హత‍్య - Sakshi

వివాహేతర సంబంధం.. యువకుల దారుణ హత‍్య

జయశంకర్‌ జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది.

భూపాలపల్లి:
జయశంకర్‌ జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆగ్రహంతో ఆ కుటుంబానికి చెందిన వ‍్యక్తులు ఇద‍్దరు యువకులను కిరాతకంగా నరికిచంపారు. ఈ సంఘటన ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కమలాపూర్‌కు చెందిన నర్రా శీను అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

విషయం తెలిసిన సదరు మహిళ కుటుంబసభ‍్యులు నాలుగు రోజుల క్రితం శీనును పిలిచి మందలించారు. వివాహేతర సంబంధం మానేయాలని సూచించారు. అతను పెడచెవినపెట‍్టడంతో ఆగ్రహించిన కుటుంబసభ‍్యులు శీనును, అతనికి సహకరిస్తున‍్న జర్సుల కల్యాణ్‌(బాలు) వ‍్యక్తిని తుదముట్టించాలని నిర‍్ణయించారు. శనివారం రాత్రి 10 గంటలకు ఇద‍్దరిని చర‍్చలకోసం పిలిచి బాగా మద‍్యం తాగించి ఇంటివద‍్దకు తీసుకెళ్ళి కళ‍్లలో కారం చల్లి గొడ‍్డళ‍్లతో నరికి చంపారు. అనంతరం నిందితులు 8 మంది పోలీసులకు లొంగిపోయారు. ఆదివారం ఉదయం శ‍్యామ్‌లాల్‌ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు వెంటబెట్టుకుని సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు. రక‍్తం మడుగులో పడిఉన‍్న మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార‍్టం నిమిత‍్తం మృతదేహాలను ఆస‍్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు కమలాపురంలోని మృతులు శీను, బాలు బంధువులు నిందితుల ఇళ‍్లపై ఆదివారం మధ్యాహ‍్నం దాడిచేసి ఇంట‍్లోని వస్తువులను ధ‍్వంసంచేశారు. ఇంట‍్లో ఫర్నీచర్‌కు నిప్పు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement