స్కూటీని ఢీకొట్టిన లారీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు | two people in injured in road accident | Sakshi
Sakshi News home page

స్కూటీని ఢీకొట్టిన లారీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

Nov 11 2016 9:12 AM | Updated on Aug 30 2018 4:10 PM

వేగంగా వెళ్తున్న లారీ.. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

తిమ్మాపూర్(కరీంనగర్): వేగంగా వెళ్తున్న లారీ.. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్కూటీ పై వెళ్తున్న వారిని వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement