ధృవ సినిమా చూసి వస్తుండగా ప్రమాదం.. | two mega fans dies after returns from druva movie | Sakshi
Sakshi News home page

ధృవ సినిమా చూసి వస్తుండగా ప్రమాదం..

Dec 10 2016 8:07 AM | Updated on Jul 14 2019 1:57 PM

ధృవ సినిమా చూసి వస్తున్న రామ్ చరణ్ అభిమానులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

ఇద్దరు మృతి...12 మందికి గాయాలు
వావిలాల(జోగుళాంబ గద్వాల): ధృవ సినిమా చూసి వస్తున్న రామ్ చరణ్ అభిమానులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా 12 మంది గాయాలపాలయ్యారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వావిలాలకు చెందిన 14 మంది రామ్‌చరణ్ ఫ్యాన్స్ శుక్రవారం రాత్రి అయిజలో ధృవ సినిమా చూసేందుకు వెళ్లారు. సినిమా చూసిన అనంతరం వారు తిరిగి ఆటోలో బయలుదేరారు.

వారి ఆటోను పందెపురం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని రాజు, సతీష్ అనే యువకులు అక్కడికక్కడే చనిపోయారు. 12 మంది తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement