కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
కారు, ఆటో ఢీ: ఇద్దరు మృతి
Dec 8 2016 11:06 AM | Updated on Aug 30 2018 4:07 PM
ఆలూరు(కర్నూలు): కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఆలూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బళ్లారికి చెందిన వెంకటసుబ్బారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, శంకర్‌రెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి.
అలాగే, ఆటోలో ఉన్న ఆస్పరి గ్రామానికి చెందిన ఆంజనేయులు(16) అక్కడికక్కడే చనిపోగా పరమేశ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులని ఆలూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement