
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు.
జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. పెట్రోలు కోసం మలుపు తిరుగుతున్న వద్ధుడు, ఎడ్లబండిని ఢీకొన్న ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. రెండు కుటుంబాల్లోనూ విషాదం అలుముకుంది.
రోడ్డుప్రమాదంలో డ్రైవర్ మతి
తలుపుల : జ్యోతివాండ్లపల్లి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓబీఆర్ కొత్తపల్లికి చెందిన రమణ(45) అనే ట్రాక్టర్ డ్రైవర్ మతి చెందాడు. మతుడి బంధువులు తెలిపిన మేరకు.. మంగివాండ్లపల్లి శ్రీరాములుకు చెందిన ట్రాక్టర్‌కు రమణ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. తన స్వగ్రామం ఓబీఆర్ కొత్తపల్లి నుంచి రోజు ఉదయం వచ్చి సాయంత్రం తమ గ్రామానికి చేరుకొనేవాడు. గురువారం రాత్రి కూడా ట్రాక్టర్ పని ముగించుకొని తన గ్రామానికి వెళ్తుండగా జ్యోతావాండ్లపల్లి వద్ద గుర్తు తెలియని టైరు బండికి ఢీకొనడంతో అక్కడికక్కడే మతి చెందాడు. ఎస్‌ఐ చంద్రశేఖర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మతదేహాన్ని కదిరికి తరలించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.వి.సిద్దారెడ్డి, మండల కన్వీనర్ శంకర ఆస్పత్రిలో మతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మతుని కుటుంబానికి 10 వేలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు తెలిపారు. వారి వెంట రైతు సంఘం శివారెడ్డి, ఎరమరెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, కొండారెడ్డి, సాహెబ్ పీరా, కుమార్‌రెడ్డి, గౌస్ మోదీన్, రాజారెడ్డి, నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.
యర్రంపల్లి వద్ద వద్ధుడు..
చెన్నేకొత్తపల్లి : యర్రంపల్లి వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం జరిగినరోడ్డు ప్రమాదంలో బెస్త ముత్యాలు(62) మతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. న్యామద్దెలకు చెందిన బెస్త ముత్యాలు వ్యక్తిగత పని నిమిత్తం టీవీఎస్ మోపెడ్‌లో ధర్మవరం బయల్దేరాడు. మార్గం మధ్యలోని యర్రంపల్లి జంక్షనన్ వద్ద పెట్రోలు కోసం తిరిగాడు. ఇంతలో వెనకే వస్తున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ముత్యాలు అక్కడికక్కడే మతి చెందాడు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు.