అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా బుధవారం జరిగిన పరీక్షలో ఇద్దరు విద్యార్థులు డీబార్ అయ్యారు. ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్–ఏ, బాటనీ–1, సివిక్స్–1 పరీక్ష జరిగింది. మొత్తం 14,822 మంది విద్యార్థులకు గాను 14,272 మంది హాజరయ్యారు. 550 మంది గైర్హాజరయ్యారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా బుధవారం జరిగిన పరీక్షలో ఇద్దరు విద్యార్థులు డీబార్ అయ్యారు. ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్–ఏ, బాటనీ–1, సివిక్స్–1 పరీక్ష జరిగింది. మొత్తం 14,822 మంది విద్యార్థులకు గాను 14,272 మంది హాజరయ్యారు. 550 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 14,307 మంది విద్యార్థులకుగాను 13,770 మంది హాజరయ్యారు. 537 మంది గైర్హాజరయ్యారు.
ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించి 515 మందికిగాను 502 మంది హాజరయ్యారు. 13 మంది గైర్హాజరయ్యారు. పామిడి ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రం, హిందూపురం ఎస్‌బీజీఎస్ జూనియర్ కళాశాల కేంద్రంలో ఒక్కొక విద్యార్థి చొప్పున డీబార్ అయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరంకు సంబంధించి 4,401 మంది విద్యార్థులకుగాను 4,250 మంది హాజరయ్యారు. 151 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 4,183 మందికి గాను 4033 మంది హాజరయ్యారు. 150 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌కు సంబంధించి 218 మందికి గాను 217 మంది హాజరయ్యారు.