ఏలూరు అర్బ¯ŒS : పెద్ద కృష్ణ హత్య కేసుకు సంబంధించి మరో నిందితుడిని టూటౌ¯ŒS పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. గత నెల 13న స్థానిక చింతచెట్టు సెంటర్‌లో నగరానికి చెందిన కంచి పెద్దకృష్ణ అనే రౌడీషీటర్‌ను కొందరు దుండగులు కిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే.
పెద్ద కృష్ణ హత్య కేసులో మలుపు
Nov 13 2016 2:05 AM | Updated on Sep 4 2017 7:55 PM
ఏలూరు అర్బ¯ŒS : పెద్ద కృష్ణ హత్య కేసుకు సంబంధించి మరో నిందితుడిని టూటౌ¯ŒS పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. గత నెల 13న స్థానిక చింతచెట్టు సెంటర్‌లో నగరానికి చెందిన కంచి పెద్దకృష్ణ అనే రౌడీషీటర్‌ను కొందరు దుండగులు కిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి టూటౌ¯ŒS పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా మరో నలుగురు కోర్టులో లొంగిపోయారు. ఈ నేపథ్యంలో హత్యకు సంబంధించి మరో ఐదుగురిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. దీనిలో భాగంగా అక్కి మురళి అనే నిందితుడు ఇంటిలో దాగి ఉన్నాడనే సమాచారం అందుకున్న సీఐ ఉడతా బంగార్రాజు, ఎస్‌సై ఎస్‌ఎస్‌ఆర్ గంగాధర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ బంగార్రాజు మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి మిగిలిన భీమవరపు సురేష్, డి.నాని, టి.ధనుంజయ, డి.చినశంకర్ అనే నిందితులను అదుపులోకి తీసుకోవాల్సి ఉందని చెప్పారు.
Advertisement
Advertisement