డిసెంబర్‌ 15 నాటికి సొరంగం పూర్తి | tunnel completed before december 15th | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 15 నాటికి సొరంగం పూర్తి

Nov 23 2016 11:36 PM | Updated on Sep 4 2017 8:55 PM

డిసెంబర్‌ 15 నాటికి సొరంగం పూర్తి

డిసెంబర్‌ 15 నాటికి సొరంగం పూర్తి

డిసెంబర్‌ 15 నాటికి ఒక సొరంగం పూర్తి అయి, 10 వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో వైఎస్సాఆర్‌ కడప జిల్లాకు నీరు అందిస్తామని సీఈ నారాయణరెడ్డి తెలిపారు.

అవుకు: డిసెంబర్‌ 15 నాటికి ఒక సొరంగం పూర్తి అయి, 10 వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో వైఎస్సాఆర్‌ కడప జిల్లాకు నీరు అందిస్తామని సీఈ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం అవుకు టన్నెల్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ స్థానిక టన్నెల్‌ నిర్మాణ పనుల్లో లెఫ్ట్‌ సొరంగంలో 208 మీటర్లు, రైట్‌ సొరంగంలో 388 మీటర్ల మేర ఫాల్ట్‌జోన్‌ పెండింగ్‌ ఉన్న కారణంగా ఆ సమస్యను అధిగమించడానికి 7మీ పొడవు, 7మీ వెడల్పుతో బైపాస్‌ టన్నెల్‌ సొరంగం పనులు చేపట్టినట్లు తెలిపారు. లైఫ్ట్‌ బైపాస్‌ టన్నెల్‌  కేవలం 67 మీటర్ల మాత్రమే పెండింగ్‌ ఉందని, రోజు 10 మీటర్ల మేర పని జరగాల్సి ఉండగా, ఫాల్ట్‌ జోన్‌ సమస్యలతో కేవలం 3 మీటర్ల పని మాత్రమే జరగుతుందన్నారు. లెఫ్ట్‌ బైపాస్‌ టన్నెల్‌ పూర్తి అయిన వెంటనే లైనింగ్‌ చేసి, రైట్‌ సొరంగం సంబంధించి బైపాస్‌ టన్నెల్‌ ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఈ సూర్యకుమార్, ఈఈ పాపారావు, డీఈలు మనోహర్‌ రాజు, ఈశ్వర రెడ్డి, శివప్రసాద్, అనిల్‌కుమార్‌ రెడ్డి, ఏఈ బోష్‌రెడ్డి, టన్నెల్‌ జీఎమ్‌ శ్రీహరి, ప్రాజెక్టు మేనేజర్‌ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement