రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన | TUGLAKH RULE IN STATE | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన

Sep 1 2016 12:08 AM | Updated on Aug 10 2018 8:23 PM

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన కొనసాగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. టేకుమట్ల మండలం చేయాలని పార్టీ నేత పులి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గిద్దెముత్తారం నుంచి టేకుమట్ల వరకు 11 కి.మీ. పాదయాత్ర నిర్వహించారు.

చిట్యాల : రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన కొనసాగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. టేకుమట్ల మండలం చేయాలని పార్టీ నేత పులి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గిద్దెముత్తారం నుంచి టేకుమట్ల వరకు 11 కి.మీ. పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా రేవూరి మాట్లాడుతూ కేసీఆర్‌ జిమ్మిక్కు పాలన చేస్తున్నాడన్నారు. రోజుకో మాటతో ప్రజలను మభ్యపెడుతున్నాడని, జిల్లా, మండల పునర్విభజన శాస్త్రీయంగా లేవని ఆరోపించారు. టేకుమట్లను మండలం చేస్తానని ప్రకటించిన స్పీకర్‌ మధుసూదనాచారి ఇప్పుడు పట్టించుకోవడం లేద న్నారు. మాజీ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ జనగాం, ములుగు సమ్మక్క–సారలమ్మ జిల్లా లు చేస్తానని ప్రకటించిన కేసీఆర్‌ ఇప్పుడు మాటమార్చారని విమర్శించారు.
 
మండలాలను కుమారులకు పంచారు..
 
స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్‌ మధుసూధనాచారి పాలన తీరు అధ్వానంగా ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అన్నా రు. ఆరు మండలాలను ముగ్గురు కొడుకులకు అప్పగించి వసూళ్ల దందా కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. వారి ఆగడాలు, బెదిరింపులు భరించలేక కాంట్రాక్టర్లు, అధికారులు పారిపోతున్నారని అన్నారు. టేకుమట్ల మండలం అయిందని స్థలాన్ని పరిశీలించి సంబరాలలో పాల్గొన్న స్పీకర్‌ మళ్లీ ఎందుకు రద్దు చేయిం చారో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి శ్రీదేవి, నాయకులు రత్నాకర్‌రెడ్డి, తోట గట్టయ్య, ఓరం సమ్మయ్య, దొడ్డి కిష్టయ్య, లింగయ్య, రాజ మౌళి, లచ్చిరెడ్డి, శంకర్, రాజేందర్, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, కొంరయ్య, సాంబ శివుడు, వెంకట్‌నాయక్, శివ, రాజు, కుమార్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement