రాజీవ్‌ గాంధీ ఆశయసాధనకు కృషి | Tribute to Rajiv Gandhi | Sakshi
Sakshi News home page

రాజీవ్‌ గాంధీ ఆశయసాధనకు కృషి

Aug 20 2016 5:34 PM | Updated on Mar 18 2019 8:51 PM

రాజీవ్‌ గాంధీ ఆశయసాధనకు కృషి - Sakshi

రాజీవ్‌ గాంధీ ఆశయసాధనకు కృషి

రాజీవ్‌గాంధీ ఆశయసాధనకు కృషి చేద్దామంటూ డీసీసీ అధ్యక్షుడు నజీర్‌ అహ్మద్‌ పిలుపునిచ్చారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా శనివారం జిల్లా కాంగ్రెస్‌ సేవాదళ్‌ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు.

కడపౖవెఎస్సార్‌ సర్కిల్‌:
రాజీవ్‌గాంధీ ఆశయసాధనకు కృషి చేద్దామంటూ డీసీసీ అధ్యక్షుడు నజీర్‌ అహ్మద్‌ పిలుపునిచ్చారు. రాజీవ్‌గాంధీ  జయంతి సందర్భంగా  శనివారం జిల్లా కాంగ్రెస్‌ సేవాదళ్‌ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు.  రాజీవ్‌పార్కు, రిమ్స్‌ వద్దనున్న రాజీవ్‌ గాంధీ విగ్రహానికి, డీసీసీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు దేశం శ్రాస్త, సాంకేతిక రంగాలల్లో అభివృద్ధి చెందడానికి కారణం రాజీవ్‌గాంధీ కృషియే కారణమన్నారు. యువతకు 21సంవత్సరాలు కాకుండా 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్‌ గాంధీకి దక్కిందన్నారు.అనంతరం అల్‌షిఫా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్‌ సెక్రటరీ సత్తార్, పీసీసీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు, జిల్లా సేవాదళ్‌ చెర్మెన్‌ చీకటి చార్లెస్, జిల్లా సేవాదళ్‌ మహిళా చెర్మెన్‌ గౌసియా, జిల్లా కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు సుజాతరెడ్డి, జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ రమణారెడ్డి, క్రిష్టియన్‌ మైనార్టీ  చైర్మన్‌ విజయ్‌భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement