గిరిజన ఉత్పత్తులకు ప్రజాదరణ | tribal products gcc chairman | Sakshi
Sakshi News home page

గిరిజన ఉత్పత్తులకు ప్రజాదరణ

Nov 26 2016 11:52 PM | Updated on Sep 4 2017 9:12 PM

గిరిజన ఉత్పత్తులకు ప్రజాదరణ

గిరిజన ఉత్పత్తులకు ప్రజాదరణ

కాకినాడ సిటీ : గిరిజన ఉత్పత్తులకు ప్రజాదరణ ఎక్కువగా ఉందని జీసీసీ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏఎస్‌పీఎస్‌ రవిప్రకాష్‌ అన్నారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టరేట్‌లోని జీసీసీ అవుట్‌లెట్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. గిరిజన ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అర్బన్‌ ప్రాంతాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచేలా చ

జీసీసీ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌, ఎండీ రవిప్రకాష్‌
కాకినాడ సిటీ : గిరిజన ఉత్పత్తులకు ప్రజాదరణ ఎక్కువగా ఉందని జీసీసీ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏఎస్‌పీఎస్‌ రవిప్రకాష్‌ అన్నారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టరేట్‌లోని జీసీసీ అవుట్‌లెట్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. గిరిజన ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అర్బన్‌  ప్రాంతాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవుట్‌లెట్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. జిల్లాలో ప్రస్తుతం గిరిజన ఉత్పతుల విక్రయాలకు కలెక్టరేట్‌ తోపాటు రాజమహేంద్రవరం, అమలాపురం, గోకవరం, ఏలేశ్వరంలలో దుకాణాలు ఉన్నాయని, అలాగే మూడు మొబైల్‌ వ్యాన్లు తిరుగుతున్నాయన్నారు. త్వరలో మరో నాలుగు దుకాణాలను రావులపాలెం, మండపేట, అన్నవరం, కాకినాడ ఏపీఎస్‌పీ ఆవరణలోనూ ప్రారంబించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌ కె.జోగేశ్వరరావు, అవుట్‌లెట్‌ మేనేజర్‌ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement