ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి బదిలీ తప్పని సరి | transfer compulsary for who completed 5years service | Sakshi
Sakshi News home page

ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి బదిలీ తప్పని సరి

May 10 2017 11:18 PM | Updated on Sep 5 2017 10:51 AM

ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న బోధనేతర సిబ్బందిని తప్పని సరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని డీఈఓ తాహెరాసుత్తానా బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కర్నూలు సిటీ: ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న బోధనేతర సిబ్బందిని తప్పని సరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని డీఈఓ తాహెరాసుత్తానా బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బోధనేతర సిబ్బంది బదిలీలపై ఉన్న నిషేధాన్ని కూడా ప్రభుత్వం ఇటీవలే తొలగించిందన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న చోట 2017 ఏప్రిల్‌ 1 నాటికి మూడేళ్లు పూర్తి చేసుకున్న వారు బదిలీ కోరుతే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఐదేళ్లు ఏళ్లు పూర్తి చేసుకున్న బోధనేతర సిబ్బంది వివరాలను, ఖాళీల వివరాలను  htt://deokrnl13.blogspot.in లో ఉంచామన్నారు. జీఓ నెంబరు 72 ప్రకారం గురువారం(11వ తేదీ) సాయంత్రం లోపు ఆన్‌లైన్‌ ఎంప్లాయీస్‌ ట్రాన్స్‌ఫర్స్‌ సిస్టమ్‌ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ప్రింట్‌ తీసుకొని ఈ నెల 12వ తేదీ సాయంత్రం లోపు డీఈఓ కార్యాలయంలో అందజేయాలన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement