చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, నవాబుపేట, ఒగులాపూర్, సుందరగిరి గ్రామాల్లో విద్యుత్ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడిన 47 మందిపై విజిలెన్స్ డీఈఈ గంగాధర్ ఆధ్వర్యంలో కేసులు నమోదు చేశారు.
-
47 మందిపై కేసులు
చిగురుమామిడి : మండలంలోని ఇందుర్తి, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, నవాబుపేట, ఒగులాపూర్, సుందరగిరి గ్రామాల్లో విద్యుత్ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడిన 47 మందిపై విజిలెన్స్ డీఈఈ గంగాధర్ ఆధ్వర్యంలో కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ అధికారులు, పదిమంది ఏఈలు టీమ్‌లుగా ఏర్పడి దాడులు నిర్వహించినట్లు ట్రాన్స్‌కో ఇందుర్తి సెక్టార్ ఏఈ వంశీకృష్ణ తెలిపారు. గృహావసరాలకు అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.