భారీ వర్షాలు : పలు రైళ్లు రద్దు | trains cancelled due to rain | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలు : పలు రైళ్లు రద్దు

Nov 17 2015 7:59 AM | Updated on Sep 3 2017 12:37 PM

భారీ వర్షాలు : పలు రైళ్లు రద్దు

భారీ వర్షాలు : పలు రైళ్లు రద్దు

భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లును రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంగళవారం ప్రకటించింది.

హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లును రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంగళవారం ప్రకటించింది. విశాఖపట్నం - తిరుపతి (తిరుమల ఎక్స్ప్రెస్ :17488), మద్రాస్ - హౌరా (కోరమండల్ ఎక్స్ప్రెస్ : 12842), అలెప్పి - ధన్బాద్ (బొకారో ఎక్స్ప్రెస్ : 13352 ),  చెన్నై సెంట్రట్ - కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్,  చెన్నై సెంట్రల్ - చప్రా (గంగా కావేరి ఎక్స్ప్రెస్)తోపాటు చెన్నై సెంట్రల్ - పూరీ ఎక్స్ప్రెస్ సర్వీసు కూడా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

ఇదిలా ఉండగా వైఎస్ఆర్ జిల్లాలో ఒంటిమిట్ట మండలం మంటపల్లి వద్ద గౌహతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. అయితే ప్రమాదంలో ప్రయాణికులకు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కాకుంటే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement