నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ | training for unemploy youth | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ

Apr 17 2017 10:44 PM | Updated on Sep 5 2017 9:00 AM

నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ రంగాలో​‍్ల ఉపాధి కల్పన పై ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు స్టీప్‌ కేరీర్‌ బిల్డర్స్‌ సంస్థ నిర్వాహకుడు కనకప్రసాద్‌ సోమవారం ప్రకటనలో తెలిపారు.

కర్నూలు (వైఎస్‌ఆర్‌ సర్కిల్‌): నిరుద్యోగ యువతీ, యువకులకు  వివిధ రంగాలో​‍్ల ఉపాధి కల్పన పై ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు స్టీప్‌ కేరీర్‌ బిల్డర్స్‌ సంస్థ నిర్వాహకుడు కనకప్రసాద్‌ సోమవారం ప్రకటనలో తెలిపారు.  దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్యయోజన పథకం కింద ఈ  శిక్షణనిస్తున్నట్లు ఆయన తెలిపారు. రిటైల్‌ రంగంలో ట్రైనీ అసోసియేట్స్‌గా, టెలికాంరంగంలో కాల్‌సెంటర్‌ రిలేషన్‌ షిప్‌ కోర్సుల పై . మూడు నెలల పాటు   శిక్షణ, ఉచిత భోజన వసతి కలిస్తామన్నారు.  కోర్సుకు సంబంధించిన  దుస్తులు, మెటీరియల్‌ కోర్సు ఉచితంగా అందజేస్తామని తెలియజేశారు. 18–30 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని నంద్యాల రోడ్డు సమీపంలో  గురుశంకర్‌ కాంప్లెక్స్‌లో ఉన్న తమ కార్యాలయంలో  దరఖాస్తులు సమర్పించాలన్నారు.  వివరాలకు 9908974815 నంబర్‌కు డయల్‌ చేయాలని సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement