హైదరాబాద్ తరహాలో స్మార్ట్ యాప్ ద్వారా రాష్ట్రంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకొంటున్నామని రాష్ట్ర డిజిపి జెవి.రాముడు పేర్కొన్నారు.
- ఏపీ డీజీపీ జేవీ రాముడు
పుట్టపర్తి టౌన్ (అనంతపురం)
హైదరాబాద్ తరహాలో స్మార్ట్ యాప్ ద్వారా రాష్ట్రంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకొంటున్నామని రాష్ట్ర డిజిపి జెవి.రాముడు పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తో పాటు.. జిల్లాలో పర్యటించిన ఆయన తన స్వగ్రామం అయిన నార్సింపల్లి లో చేపట్టనున్న అభివృద్ది పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ట్రాఫిక్ నియంత్రణకు స్మార్ట్ యాప్‌ను ప్రవేశ పెట్ట నున్నట్లు వివరించారు. పైలట్ ప్రాజెక్ట్ క్రింద అనంతపురంను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.