శ్రీశైలం ఘాట్‌రోడ్డులో బస్సు బోల్తా | tourist bus overturned at srisailam ghat road | Sakshi
Sakshi News home page

శ్రీశైలం ఘాట్‌రోడ్డులో బస్సు బోల్తా

Dec 23 2016 10:27 AM | Updated on Apr 7 2019 3:24 PM

శ్రీశైలం సమీపంలోని ఘాట్ రోడ్డులో ఓ టూరిస్టు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది.

శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని రామయ్య టర్నింగ్ పాయింట్ వద్ద ఘాట్ రోడ్డులో ఓ టూరిస్టు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 12 ఏళ్ల బాలిక అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 10 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి శ్రీశైలానికి తీర్ధయాత్రలో భాగంగా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement