'ఆయనకు ఏకలవ్య శిష్యుడిని' | Tollywood director S. Srinivasa Reddy interview with sakshi | Sakshi
Sakshi News home page

'ఆయనకు ఏకలవ్య శిష్యుడిని'

Jan 19 2016 9:11 AM | Updated on Aug 28 2018 4:30 PM

'ఆయనకు ఏకలవ్య శిష్యుడిని' - Sakshi

'ఆయనకు ఏకలవ్య శిష్యుడిని'

తాను దర్శకత్వం వహించిన ఢమరుకం చిత్రం తనకు మంచి పేరు తెచ్చిందని ప్రముఖ సినీ దర్శకుడు సబ్బెళ్ళ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

రాజమండ్రి : తాను దర్శకత్వం వహించిన ఢమరుకం చిత్రం తనకు మంచి పేరు తెచ్చిందని ప్రముఖ సినీ దర్శకుడు సబ్బెళ్ళ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రావులపాలెంలోని స్నేహితుడు పడాల రామిరెడ్డి ఇంటికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
 
*జిల్లాలోని బలభద్రపురం మా స్వస్థలం. అయితే పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగలవారిపాలెంలో స్థిరపడ్డాం. ఇలా ఉభయ గోదావరి జిల్లాలతో నాకు మంచి అనుంబంధం ఉంది.
 
*1984లో సినీరంగ ప్రవే శం చేశాను. చాలామంది డెరైక్టర్ల వద్ద అసిస్టెంటుగా పని చేశాను.
 

*పశ్చిమ గోదావరి జిల్లా నత్తా రామేశ్వరానికి చెందిన స్నేహితులు ఆనందరెడ్డి, ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, రామలింగేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి నిర్మాతలుగా.. 1996లో తొలిసారి ఆలీ హీరోగా ఆషాఢం పెళ్ళికొడుకు చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు.
 
*ఇప్పటివరకూ తొమ్మిది చిత్రాలకు దర్శకత్వం చేశాను. ఆషాఢం పెళ్ళికొడుకు; సుమన్, భానుప్రియలతో ఫిబ్రవరి 14 నెక్లస్ రోడ్; శివాజీ, లయలతో అదిరిందయ్యా చంద్రం; శివాజీ, కృష్ణభగవాన్, లయలతో టాటా బిర్లా మధ్యలో లైలా; శ్రీకాంత్, వేణు మీరాజాస్మిన్‌లతో యమగోల మళ్ళీ మొదలైంది; అల్లరి నరేష్, ఫర్జానాలతో బొమ్మన బ్రదర్స్ - చందన సిస్టర్స్; కుబేరులు వీళ్ళకి అన్ని అప్పులే; నాగార్జున, అనుష్కలతో ఢమరుకం; ఇటీవల మామ మంచు అల్లుడు కంచు చిత్రాలకు దర్శకత్వం వహించాను.
 
*నాగార్జునతో చేసిన ఢమరుకం చిత్రం మంచి పేరు తెచ్చింది. నాగార్జున కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించింది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ సినిమాకోసం మూడేళ్లు కష్టపడి స్క్రిప్ట్ వర్‌‌క చేశాం.

*త్వరలో రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. ఢమరుకం స్థాయిలో ఒక భారీ బడ్జెట్ మూవీ కూడా ఉంటుంది. వివరాలు త్వరలో తెలుస్తాయి.
 
*దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంటరీలను రూపొందించే అవకాశం నాకు కలిగింది. దానికోసం సినిమాలను వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వైఎస్‌ఆర్ అంటే నాకు అంత అభిమానం.
 
*రావులపాలేనికి చెందిన పడాల రామిరెడ్డి, మేడపాటి రామిరెడ్డి నాకు మంచి మిత్రులు. అక్కాబావలది పక్కనే ఉన్న కొమరాజులంక గ్రామం.
 
*ఈవీవీ సత్యనారాయణ నాకు ఇష్టమైన దర్శకుడు. ఆయనతో కలసి పని చేసే అవకాశం రాలేదు కానీ ఆయనను గురువుగా భావిస్తాను. ఒకరకంగా చెప్పాలంటే నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement